Sunday, May 24, 2020

ఆదిభట్ల నారాయణ దాసు గారిది ఏ మతం

ఆదిభట్ల నారాయణ దాసు గారిది ఏ మతం? ఆయన మాటలలోనే వినండి!

"చం: కలయందెత్తెడు మేను దోచెడి జగత్కార్యంబులుం జిత్తసం
          చలత న్వాస్తవ మందుపోల్కిగనుడీ సర్వ ప్రపంచంబు న​
          జ్ఞులకు న్నిక్కముగాగ​నంబడును బ్రాజ్ఞు ల్పూర్ణభావంబు ని
          శ్చలమౌట న్దమకన్న వేరు గన రీశత్వంబు బ్రాపించుచున్

"అనియు ననగా మనఃకల్పిత మీదృశ్యమంతయుగాని వాస్తవము కాదని ప్రస్థానత్రయము మొదలగు వేదాంతగ్రంథములు జూచుటచే దృఢవిశ్వాసము కలిగెను." 

— ఆదిభట్ల నారాయణ దాసు. (2012). నాయెరుక​. మోదుగుల రవికృష్ణ (సం) మిత్రమండలి ప్రచురణలు. గుంటూరు. పు. 200