నారాయణ దాసు గారికి సీస పద్య వృత్తం అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే భాషా
సౌందర్యానికి, భావ వ్యక్తీకరణకి ‘సీసం’ చక్కని వాహిక. దిగంతమే ప్రతిభకి హద్దు అయిన సంగీత
సాహిత్య సార్వభౌముడే అల్లిన సీస పద్య సౌలభ్యం గురించి ఇక చెప్పేదేముంది? రుక్మిణి కళ్యాణం హరికథలోని ఈ సీస పద్య సౌందర్యాన్ని ఆస్వాదించండి!
దుర్వాంకురంములతో సన్నజాజులు 
          మొగలిరేకులు
జారుసిగను జుట్టి  
తళుకుజెక్కుగులాబిదంతము నిగనిగ
          రవలకమ్మలజోడు
జెవులబెట్టి    
లేతప్రాయపు బిగిచేతిగాజులు, రైక
          యొడ్డాణమున్వెలియుడుపుగట్టి 
ముద్దుమొగంబున ముత్తయిదుచిన్నెల 
          నంబపేరిట
నోగిరంబు వట్టి
వెన్నెలలు చీకటులు బర్వు కన్నుదోయి
ముత్తెముల్కెంపులొల్కెడి ముద్దువాయి
నందమగు రుక్మిణికన్య యలరు హాయి
చాటిజెప్పగ వేయినోళ్ళు చాలవోయి
 
